Ap Icet” ఏపీ ఐసెట్‌ 2025 ఫలితాలు విడుదల – విశాఖ విద్యార్థికి టాప్ ర్యాంక్

Ap Icet”  ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET) 2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ప్రకటించారు.

ఏడాది పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో 95.86 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రకటించారు. మొత్తం 34,131 మంది పరీక్ష రాశారు. వీరిలో 32,719 మంది ఉత్తీర్ణులు అయ్యారు.

టాప్ ర్యాంకర్లు:

  • 1వ ర్యాంక్: మనోజ్ మేకా (విశాఖపట్నం)

  • 2వ ర్యాంక్: సందీప్ రెడ్డి

  • 3వ ర్యాంక్: కృష్ణ సాయి

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అదనంగా, వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందడం సాధ్యపడుతుంది.

మంత్రి నారా లోకేశ్ అభినందనలు:

హై ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.

AP ICET 2025లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. వారి విద్యా ప్రయాణం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. ఫలితాలు WhatsApp నంబర్ 9552300009లో అందుబాటులో ఉన్నాయి,” అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *