Ap Icet” ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET) 2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ప్రకటించారు.
ఈ ఏడాది పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో 95.86 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రకటించారు. మొత్తం 34,131 మంది పరీక్ష రాశారు. వీరిలో 32,719 మంది ఉత్తీర్ణులు అయ్యారు.
టాప్ ర్యాంకర్లు:
-
1వ ర్యాంక్: మనోజ్ మేకా (విశాఖపట్నం)
-
2వ ర్యాంక్: సందీప్ రెడ్డి
-
3వ ర్యాంక్: కృష్ణ సాయి
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అదనంగా, వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందడం సాధ్యపడుతుంది.
మంత్రి నారా లోకేశ్ అభినందనలు:
హై ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.
“AP ICET 2025లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. వారి విద్యా ప్రయాణం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. ఫలితాలు WhatsApp నంబర్ 9552300009లో అందుబాటులో ఉన్నాయి,” అని పేర్కొన్నారు.
