Summer Camps” విలాసాగర్‌లో జోరుగా హుషారుగా సమ్మర్ క్యాంపులు

Summer Camps శంకరపట్నం డిసి ప్రతినిధి
Vilasagar Summer Camps  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 1 నుంచి ప్రారంభమైన సమ్మర్ క్యాంపులు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. వాలీబాల్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, స్పోకెన్ ఇంగ్లీష్, రైటింగ్ మరియు కంప్యూటర్ శిక్షణ శిబిరాలు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్), జిల్లా యువజన క్రీడల శాఖ, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మార్గదర్శకంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

Rural Education Training

వాలీబాల్ శిక్షణ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పంతం ప్రభాకర్, కంప్యూటర్ కోఆర్డినేటర్ శైలజా, ఇంగ్లీష్, రైటింగ్‌లో సౌమ్య మరియు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్‌లో మణి ల నేతృత్వంలో శిక్షణలు అందిస్తున్నారు. పాల్గొనేవారు “ప్రోత్సాహం ఉంటే క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించగలం. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్‌లో మంచి పరిజ్ఞానం పెంపొందిస్తున్నాం” అని ఉత్సాహంగా తెలిపారు.

Student Skill Development

ఈ శిక్షణలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం సుమారు 160 మందికి పైగా విద్యార్థులు, గ్రామస్తులు ఇందులో పాల్గొంటున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొలగం శ్రీనివాస్ శిక్షణలను పర్యవేక్షిస్తూ, అవసరమైన సదుపాయాలు మరియు అల్పాహారం అందిస్తున్నారు.

Government School Initiatives

హెడ్ మాస్టర్ బొలగం శ్రీనివాస్ మాట్లాడుతూ, “మా పాఠశాలలో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులతో విద్యార్థులు విద్య, క్రీడలు, ఇతర రంగాలలో మంచి విజయం సాధించాలి. ప్రభుత్వ బడుల్లో విద్య తీసుకుంటున్న పిల్లలకు గ్రామస్తులు మరింత ప్రోత్సాహం అందించి, పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను” అన్నారు.

Youth Empowerment Programs

ఈ సమ్మర్ క్యాంపులు విద్యార్థులకు మాత్రమే కాకుండా, గ్రామస్తులందరికీ సరికొత్త నైపుణ్యాలు నేర్చుకునే అద్భుతమైన వేదికగా మారుతున్నాయి.

 మ‌న ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా వార్త‌ల కోసం Karimnagar పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *