Local news”
మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో బత్తిని జన్మదిన వేడుకలు
శంకరపట్నం డిసి ప్రతినిధి
కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పిటిసి, టిపిసిసి సభ్యుడు బత్తిని శ్రీనివాస గౌడ్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, “గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్న శ్రీనివాస గౌడ్ సేవలు మరువలేనివి. ఆయన నాటి మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి నుండి ఇప్పటి వరకు నాయకుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు” అని ప్రశంసించారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, “శ్రీనివాస గౌడ్ కాంగ్రెస్ జెండాను ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వదలకుండా పార్టీకి అంకితంగా పనిచేశారు. ఆయన ప్రజల్లో విశేష ప్రజాదరణ కలిగి ఉన్న నాయకుడు. అలాంటి నేతకు మరింత గుర్తింపు రావాల్సిందే” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ మత్స్య గిరింద్ర స్వామి ఆలయ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి, హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తనకు ప్రభాకర్, మానకొండూరు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు గాజుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ శ్రీనివాస్ రెడ్డి, మహిళా మండల పార్టీ అధ్యక్షురాలు చింతరెడ్డి పద్మ, మాజీ సర్పంచులు రాజ కొమురయ్య, బండారి స్వప్న తిరుపతి, కీసర సుజాత సంపత్ , అధ్యక్షులు గొట్టే మధు, మొలమూరి సదానందం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెపు అజయ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మహమ్మద్ షారుక్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గండికోట రవి, మాజీ ఉప సర్పంచ్లు అడితం కుమార్, వెంగళ శ్రీనివాస్, కన్నబోయిన జంపయ్య మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గండికోట రవి, కాంగ్రెస్ నాయకులు గోడిశాల ప్రవీణ్, జనగం శ్రీనివాస్, సంతోష్, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జన్మదిన వేడుకలు పార్టీ మద్దతుతో ఘనంగా నిర్వహించబడిన ఈ సందర్భం, పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నాయకులు అభిప్రాయపడ్డారు.
మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల కోసం Karimnagar పై క్లిక్ చేయండి
Viral video” రీల్స్ గొడవ… పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వీడియో
