Anganwadi” అమ్మ మాట అంగన్వాడి బాట:

Anganwadi”  అర్హులైన‌  ప్రతి ఒక్క‌రూ సేవలను వినియోగించుకోవాలి – సూపర్వైజర్ పద్మ

శంకరపట్నం, మే 23 డిసి ప్రతినిధి :
“అంగన్వాడి సేవలు  అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి” అని అంగన్వాడి సూపర్వైజర్ పద్మ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలో మెట్‌పల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ అనే  కార్యక్రమం  నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి చిన్నారిని అంగన్వాడి కేంద్రాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. చిన్నారులకు విద్యతో పాటు ఆటపాటలు, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కేంద్రాలు నడుస్తున్నాయని, పిల్లల భవిష్యత్‌కు మద్దతుగా ప్రతి తల్లి తండ్రి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో ఇంటింటా తిరిగి అర్హులైన చిన్నారులను గుర్తించి అంగన్వాడి కేంద్రాలలో చేర్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపర్వైజర్ పద్మ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఏఎన్ఎంలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

క‌రీంన‌గ‌ర్ వార్త‌ల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *