Loses cow” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
మానకొండూర్ నియోజకవర్గంలోని కేశవపట్నం గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటనలో కరెంట్ షాక్‌తో ఒక పాడి ఆవు మృతి చెందింది. బాధిత రైతు ఆరేపల్లి తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం, తన పాడి ఆవును మేత కోసం వాగు ఒడ్డున వదిలిన సమయంలో, వ్యవసాయ మోటార్‌కు సంబంధించిన వైరు ద్వారా విద్యుత్ షాక్ తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.
పాడి ఆవు విలువ సుమారుగా రూ. 50,000 ఉండవచ్చని పేర్కొన్న తిరుపతి, తన కుటుంబ జీవనాధారం అదే ఆవు ఆధారంగా కొనసాగుతుందన్నారు. ఆవు మృతితో తాను తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నానని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
