Local News” 16.04.2025 శంక‌ర‌ప‌ట్నం వార్త‌లు

Local News” గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరవేయాలి…
రజ‌తోత్సవ సభకు భారీగా తరలి రావాలి…
మాజీ ఎమ్మెల్యే రసమయి….
శంకరపట్నం డిసి ప్రతినిధి  


భారతీయ రాష్ట్ర సమితి రజతోత్సవం రోజున గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగరవేయాల‌ని, రజతోత్సవ సభకు ఎల్కతుర్తి కి భారీగా తరలిరావాలని బిఆర్ఎస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృత సారధి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజర‌య్యారు. బిఆర్ఎస్ రజతోత్సవ గోడపత్రికలను, ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన పార్టీ టిఆర్ఎస్, బిఆర్ఎస్, ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంద‌న్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ఈ నెల 27న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల సభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించ‌నున్న‌ట్టు తెలిపారు. రజతోత్సవాలకు బయలుదేరే ముందు అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరవేయాల‌ని కోరారు. రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని, పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమకారులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహిపాల్, మాజీ జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి, పాలకవర్గ సభ్యులు బోడ సుధాకర్, తాజా మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, తాజా మాజీ సర్పంచులు వెంకట రమణారెడ్డి, చుక్కల రవి, విజయ్ కుమార్ రెడ్డి, కిషన్ రావు, అనుష శ్రీనివాస్, వసంత నరసింహారెడ్డి, సుష్మ మహేష్, లతా సంపత్, తాజా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పెద్ది శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ ఎంపిటిసిలు గుర్రం రామస్వామి, భూమ సంపత్, గాండ్ల తిరుపతి, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, పార్టీ నాయకులు ఉమ్మెత్తల సతీష్ రెడ్డి, ఖాజా కలీం, గుర్రం శ్రీకాంత్ గౌడ్, రవి, తిరుపతి రెడ్డి, రమేష్, మేడుదుల ఐలయ్య, రాజయ్య, లతోపాటు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////////////

అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య…
ప్రతి చిన్నారికి ప్రాధాన్యత….
అంగన్వాడి సేవలను వినియోగించుకోవాలి…
సిడిపిఓ శ్రీమతి…
శంకరపట్నం, డిసీ ప్రతినిధి 


ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించిందని, ప్రతి చిన్నారులకు విద్యను అందించేందుకు అంగన్వాడి కేంద్రాల్లో ప్రత్యేకంగా బోధనలు చేయ‌నున్న‌ట్టు, ప్రతి ఒక్కరూ సేవలను వినియోగించుకోవాల‌ని సిడిపిఓ శ్రీమతి అన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలం గద్దపాక, ఎరడపల్లి గ్రామాల్లో మంగళవారం ఫోషణ్‌ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. అనంత‌రం పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ శ్రీమతి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు విద్యపై మక్కువ పెంచేందుకు ప్ర‌భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అంగన్వాడి కేంద్రాల్లోని టీచర్లు చిన్నారులకు ఇంటి వద్ద తల్లిదండ్రుల మాదిరిగా ప్రేమను రాగాలతో విద్యను బోధిస్తార‌ని వివ‌రించారు. పూర్వ విద్య పేరుతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పొందాలన్నారు. మహిళల ఆరోగ్యం కోసం, గర్భిణీ స్త్రీల కోసం, హెల్త్ క్యాంపు లతోపాటు, అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న‌ట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడి సేవలను వినియోగించుకొని ఆర్థిక ఎదగాలన్నారు. మండల వైద్య అధికారి గొట్టే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్య సేవలను కల్పించి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న‌ట్టు చెప్పారు. మహిళల ఆరోగ్యం కోసం, చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్న‌ట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాల సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరడపల్లి పల్లె దావకాన వైద్య అధికారి సురేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు, అరుణ, పద్మ, అంగన్వాడి టీచర్లు కరుణ, శోభా , స్వరూప, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఆయాలు, గర్భిణీ స్త్రీలు చంటి పిల్లల తల్లులు చిన్నారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////////////////////////////////

తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ గా గణేష్ ఎన్నిక…
పార్టీ పటిష్టత లక్ష్యంగా పనిచేస్తా…
కృతజ్ఞతలు తెలిపిన గణేష్…
శంకరపట్నం, డిసీ ప్రతినిధి 


తెలంగాణ జన సమితి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా జన సమితి రాష్ట్ర నాయకులు, హుజురాబాద్ ప్రముఖ న్యాయవాది. ముక్కెర రాజు ప్రధాన అనుచరుడు మోరె గణేష్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా జన సమితి కన్వీనర్ గా నియామకమైన మోరె గణేష్ మాట్లాడారు.
ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీకి గత కొన్ని ఏళ్ల నుంచి సేవలందిస్తున్న తన సేవలను గుర్తించి, టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం, రాష్ట్ర నాయకులు హుజరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ముఖ్యల రాజు ఆశీస్సులతో నియామకపు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. యువజన సమితి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు కరీంనగర్ జిల్లాలో అనేక స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహించడం పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున‌న్నారు. తనపై నమ్మకంతో జిల్లా కన్వీనర్ గా నియామకం చేసి నియామక పత్రాన్ని అందజేశారని తెలిపారు. టీజేఎస్ వ్యవస్థాపకులు కోదండరాం, టీజేఎస్ రాష్ట్ర నాయకులు ముక్కెర రాజు, సతీష్ రెడ్డి, స్రవంతి, తన నియామకానికి కృషిచేసిన నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీజేఎస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో పటిష్టతకు అహర్నిశలు కృషి చేస్తానని, తన నియామకానికి ప్రతి ఒక్కరికి గణేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *