Government schools” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
మొలంగూర్‌లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫార్మ్స్ పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కంకణాల నీరజ మాట్లాడారు.
ఆమె మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ముందుకెళ్తోంది. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్మ్స్, షూస్, క్రీడా సామాగ్రి వంటి అన్ని సదుపాయాలు ఉచితంగా అందిస్తున్నారు” అని చెప్పారు.
అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం కలిగిన, అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తు కోసం శ్రేష్ఠమైన అడుగులు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు దేశ్‌ముక్, ఆశా కార్యకర్త జహెద్, ఇతర టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
