Manchiryal News” శంకరపట్నం డిసీ ప్రతినిధి
స్నేహానికి వయస్సుతో సంబంధం ఉండదని, బాల్యంలో ఏర్పడిన బంధం ఎంత గాఢమైతే జీవితాంతం నిలిచే శక్తి కూడా అంతే ఎక్కువగా ఉంటుందని నిరూపించిన సంఘటన ఇది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన జోగు వెంకన్న తల్లి మరణానంతరం నిర్వహించిన ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన బాల్య మిత్రులు హాజరై, ఆమెకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ న్యూస్ సంపాదకులు, సీనియర్ పాత్రికేయుడు డిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ:
“ఇదే నిజమైన స్నేహం. బాల్యంలో చదువుకున్న మిత్రులు పదేళ్ల తరవాతలు అయినా ఈవిధంగా ఒక్కరు కోసం కలుస్తే, అది సమాజానికి గొప్ప సందేశం” అని పేర్కొన్నారు.
రామిడి కుమార్, బట్టు సుధాకర్, లలిత, రాజేశ్వరి, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సామల రవి, రమణ, రాజ్ కుమార్, మిర్చి రాములు, వెంకటేష్, ప్రభాకర్, కృష్ణ, చాంద్ పాషా, తూల వేణు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ .. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు.
