Bhubharati” భూ భారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి: బత్తిని శ్రీనివాస్ గౌడ్

Bhubharati” తాడికల్, కరీంనగర్ జిల్లా:
తెలంగాణ రాష్ట్రంలోని రైతులు భూ సమస్యలపై పరిష్కారం పొందేందుకు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని, మాజీ జెడ్పిటిసి సభ్యుడు, టీపీసీసీ నాయకుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

మంగళవారం తాడికల్ గ్రామంలో ఎమ్మార్వో కే. సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గత టీఆర్‌ఎస్ ప్రభుత్వ  హాయంలో రైతులు తమ భూముల సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీ మేరకు ‘ధరణి’ వ్యవస్థను తొలగించి, భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులకు న్యాయం చేస్తోంది” అని అన్నారు.

ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని ఆయన తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని తమ భూముల సమస్యలను తీర్చుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పార్థసారథి, RI ప్రత్యూష, ఇతర అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *