క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆరోసారి ఆస్ట్రేలియా టీం చాంపియన్ గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఆస్ట్రేలియా ప్లేయర్లను సర్వత్ర అభినందిస్తున్నారు. కానీ సాధారణంగానే ఆసీస్ క్రికెటర్లకు అహం ఎక్కువ అని క్రికెట్ వర్గాల్లో వినికిడి. ప్రపంచకప్ గెలిచి డ్రెస్సింగ్ రూం చేరుకున్న ఆసీస్ ప్లేయర్లు తీరుపై అందరూ మండిపడుతున్నరు. ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ సరదాగా వరల్డ్ కప్‌తో ఫోటోలు దిగారు. ఆ జట్టులోని స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం ఓవర్‌గా ప్రవర్తించాడు. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగుతూ ఫొటోలో దిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ఇంత అహమా అంటూ ప్రశ్నిస్తున్నారు. హుందాగా వ్యవహరించాలి కానీ ఇలా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. 2011 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకున్నప్పుడు సెహ్వాగ్, సచిన్, ధోని లాంటి ఇండియన్ క్రికెటర్లు కప్‌ను ముద్దాడుతున్న ఫొటోలను ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. 2007లో నూ ప్రపంచ కప్ గెలిచిన సందర్భంలోనూ అప్పటి ఆసీస్ క్రికెటర్లను ఇలాగే ప్రవర్తించారు. అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శరద్ పవార్ ను స్టేజీ మీదనుంచి కెప్టెన్ రికీపాటింగ్ నెట్టివేశారు.
నిన్నటి రోజు మనది కాదు… డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోడీ
విరాట్‌ను హత్తుకుని ఓదార్చిన అనుష్క
ఆ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపాపకు రూ. ఐదు వేల ఆర్థిక సాయం రేండ్ల శ్రీనివాస్ ఔదార్యం