Vishwambhara” మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ తాజా అప్‌డేట్‌

 Vishwambhara”  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలున్న పాన్ ఇండియన్ మూవీ ‘విశ్వంభర’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. సినిమా దర్శకుడు వశిష్ఠ. ప్రస్తుతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది.

ఇటీవల విడుదలైన టీజర్‌పై వచ్చిన ట్రోల్స్ కారణంగా, మేకర్స్ గ్రాఫిక్స్ పైన మరింత కష్టపడి పని చేస్తున్నారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులను హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ స్టూడియోకే అప్పగించారు. ఈ హాలీవుడ్ స్టూడియో విశ్వంభర సినిమాకు అధిక నాణ్యత గల వీఎఫ్ఎక్స్ అవుట్పుట్ ఇవ్వనున్నది. వీఎఫ్ఎక్స్ పూర్తి అయిన తర్వాతనే మేకర్స్ విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. సోషియో ఫాంటసీ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్నారు.

UPI ATM” ఏటీఏం పై ఫోన్‌పే, గూగుల్ పేతో స్కాన్ చేసి న‌గ‌దు తీసుకోవ‌చ్చ.. డిజిటల్ బ్యాంకింగ్‌లో విప్లవాత్మక మార్పు

Illegal immigrants” 2025అమెరికా సరిహద్దుల్లో పట్టుబడుతున్న భారతీయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *