New movies” ఆగస్ట్‌లో సినిమా ప్రియుల‌కు పండ‌గే..

New movies

New movies” వచ్చే ఆగస్టు నెల‌లలో సినిమాల సంద‌డి నెల‌కొన‌నుంది. ఆగ‌స్టు 15న సినిమా ల‌వ‌ర్స్‌కి మంచి శుభవార్త. ఆరోజున ముగ్గురు హీరోలు తమ చిత్రాల‌తో పోటీ పడుతున్నారు. ఇందులో ఇద్దరు సీనియర్ యాక్ట‌ర్స్, మ‌రొక‌రు యంగ్ యాక్ట‌ర్ ఉన్నారు. హీరో రామ్‌ పోతినేని, పూరి జగన్‌ కాంబినేషన్ లో డబుల్‌ ఇస్మార్ట్‌స సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కి సీక్వల్ గా ఈ మూవీ రానుంది. ఇస్మార్ట్ శంక‌ర్ ఈ ఇద్ద‌రి కాంబినేషన్‌ లో విజయవంత‌మైన విష‌యం తెలిసిందే. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న‌ది. బాలీవుడ్ యాక్ట‌ర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా రోల్‌లో న‌టిస్తున్నారు. నిర్మాత‌లుగా పూరి జగన్‌, ఛార్మిలు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
సినిమా రవి తేజ, డైరెక్ట‌ర్ హ‌రీష్‌ శంకర్ ల సార‌థ్యంలో ‘మిష్టర్‌ బచ్చన్ వస్తున్న‌ది. ఇది హిందీ మూవీ ‘రైడ్‌’ కి రీమేక్‌ గా దీనిని తెర‌కెక్కించారు. రాజ్‌ కుమార్‌ గుప్త డైరెక్ష‌న్ వ‌హించిన ఈచిత్రంలో అజయ్‌ దేవగన్ హీరో, కాగా ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ఇన్కమ్‌ టాక్స్‌ రైడ్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ మూవీ డైరెక్ట‌ర్ హరీష్‌ శంకర్‌ ‘మిష్టర్‌ బచ్చన్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. సౌరబ్‌ శుక్ల నటించిన రోల్‌ను తెలుగులో జగపతి బాబు పోషిస్తున్నారని స‌మాచారం. ఈమూవీ కూడా ఆగస్టు 15న విడుదలవుతుందని సినిమా బృందం ప్ర‌క‌టించారు.

మ‌రో సినిమా ‘తంగలాన్‌’. పా.. ఈ మూవీలో తమిళ యాక్ట‌ర్ విక్రమ్‌ నటించారు. దీనికి డైరెక్ట‌ర్ రంజిత్, పెద్ద బ‌డ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు నెల 15న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ మూవీ తమిళం, తెలుగు భాషలతో పాటు అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న‌ది.
ఆగస్టు 15వ తారీఖున మూడు సినిమాలతో ముగ్గురు హీరోలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 15న త‌రువాత వ‌రుసగా సెల‌వులు ఉండ‌డం ఈ సినిమాల‌కు క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Plane Crash” టేకాఫ్ అవుతూ ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి.. వీడియో

Whale Viral Video” బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. వీడియో వైర‌ల్

Fire Accident” హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

Bogota Falls” బొగత జలపాతం వ‌ద్ద విషాదం… యువకుడు మృతి

Crime News” ఆరుగురు సొంత కుటుంబ స‌భ్యుల‌నే చంపిన మాజీ సోల్జ‌ర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *