Hari Hara Veera Mallu” పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘హరిహర వీరమల్లు’ తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి.
ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే తెలుగు వర్షన్‌కు 48 మిలియన్ల వ్యూస్ రావడం ద్వారా ఇది సౌత్ ఇండియాలో ట్రైలర్ వ్యూస్ పరంగా ఆల్‌టైమ్ రికార్డు అవడమే కాకుండా, పుష్ప 2 హోల్డ్ చేసిన రికార్డును కూడా చెరిపేసిందని అభిమానులు సంబరపడుతున్నారు. అన్ని భాషల్లో కలిపితే ట్రైలర్‌కు 61.7 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
చిత్రబృందం ట్వీట్ చేస్తూ –
“ఇది సాధారణ రికార్డ్ కాదు… భవిష్యత్తులో వచ్చే సినిమాలన్నిటికీ ఇది హెచ్చరిక”
అని వ్యాఖ్యానించారు.
