Anupama Parameswaran” సోషల్ మీడియా కామెంట్స్‌ నేను ప‌ట్టించుకోను.. నటి అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran”  తనపై వచ్చే సోషల్ మీడియా ట్రోల్స్‌, నెగెటివ్ కామెంట్స్‌ను గురించి స్పందించిన నటి అనుపమ పరమేశ్వరన్, అవి తనపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. “నిజంగా ఒక సినిమాపై నాకు నమ్మకం ఉంటే, ఇతరుల మాటలు పట్టించుకోను” అంటూ ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆగస్టు 22న విడుదల కానున్న ‘పరదా’ సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు ఏ సినిమా అయినా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కొందరు నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తుంటారు. ‘అట్టర్ ఫ్లాప్ అవుతుంది’ అని చెప్పేవారు ఉన్నారు. కానీ సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులే నిర్ణయిస్తారు” అని అన్నారు.

తన కెరీర్ ప్రారంభ దశలో నెగటివిటీకి ఎక్కువగా బాధపడేదాన్ని, కానీ అనుభవం వచ్చాక వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగడం నేర్చుకున్నానని ఆమె తెలిపారు. “ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు” అని స్పష్టంచేశారు.

టిల్లు స్క్వేర్ సినిమా విడుదలకు ముందు వచ్చిన నెగెటివిటీపై కూడా ఆమె స్పందించారు. “ఆ సినిమాకి ముందు నాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ రిలీజ్ తర్వాత ఆ సినిమాతో మంచి స్పందన వచ్చింది. అలాంటి పాత్రలు స్వీకరించడం కూడా ఒక సవాలే. ధైర్యంగా ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది” అని చెప్పారు.

అలాగే, సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో మహిళా నటులను మాత్రమే టార్గెట్ చేస్తూ అడిగే కొన్ని అసౌకర్యకరమైన ప్రశ్నలపై ఆవేదన వ్యక్తం చేశారు. “అలాంటి ప్రశ్నలు హీరోలను ఎందుకు అడగరు? కేవలం వ్యూస్ కోసమే మహిళలతో మాత్రమే అలా ప్రవర్తించడం సరికాదు” అని అభిప్రాయపడ్డారు.

హానర్ X7c 5G – కొత్త లెవెల్ కి స్మార్ట్‌ఫోన్ అనుభవం!
కేవలం ₹14,999 కే!

ఫీచర్లు అదుర్స్!
50MP AI కెమెరా – కదలికలలోనూ నవ్వులలోనూ క్లియర్ క్లిక్!
️ SGS 5-Star డ్రాప్ & క్రష్ రెసిస్టెన్స్ – గట్టి, గమ్మత్తైన బిల్డ్
IP64 వాటర్ రెసిస్టెంట్ – చెరుపులో నీరు వచ్చినా భయపడక్కర్లేదు
⚡ 120Hz స్క్రీన్ | 850 నిట్స్ బ్రైట్నెస్ – సూర్యుడి కాంతిలోనూ స్పష్టంగా!
8+8GB RAM (Honor RAM Turbo) – స్మూత్ మల్టిటాస్కింగ్
256GB స్టోరేజ్ – 60,000 ఫొటోలు స్టోర్ చేయొచ్చు
300% వాల్యూమ్ బూస్ట్ డ్యూయల్ స్పీకర్లు – హై-రెజ్ ఆడియో క్లారిటీతో

వేగన్ లెదర్ ఫారెస్ట్ గ్రీన్ లో అందుబాటులో ఉంది

పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ ఫీచర్లు – అదీ ఈ ధరకు మిస్ అవ్వకండి!

అమెజాన్‌లో వివ‌రాల‌కు https://amzn.to/4lCSGHk లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *