Bandi Sanjay” తాను కూడా పేదరికం నుంచి పైకి వచ్చినవాడినని పేర్కొంటూ, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని చదువులో ముందుకు సాగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు.
“ఇది మోదీ గిఫ్ట్” – కేంద్ర మంత్రికి విద్యార్ధులపై ప్రేమ
ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, ఈ సైకిళ్లు ప్రధాని నరేంద్ర మోదీ గారి గిఫ్ట్ అని పేర్కొన్నారు. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్న మోదీ ప్రభుత్వం సేవలో ఇది చిన్న ఉదాహరణ అని తెలిపారు.
“నేను కూడా తిండికి ఇబ్బంది పడిన పేదవాడినే. కానీ మా తల్లిదండ్రుల కష్టమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని భావోద్వేగంతో వివరించారు. తన ఎంపీ పదవిలో ఉన్నంతకాలం ప్రతీ సంవత్సరం టెన్త్ విద్యార్థులకు సైకిళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, త్వరలోనే విద్యార్థులకు “మోదీ కిట్” కూడా అందిస్తానని ప్రకటించారు.
సైకిల్ – స్వీయ నమ్మకానికి ప్రతీక
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, సైకిల్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొమరయ్య బండి సంజయ్‌ను ఘనంగా సత్కరించారు.
కేంద్ర మంత్రిగా బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలుగా మార్చడంపై జిల్లా ప్రజల్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. రాబోయే నెల రోజుల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు.
Nimisha Priya” భారతీయ నర్సుకు యెమెన్‌లో జూలై 16న ఉరిశిక్ష అమలు కారణమిదే..
