Cleanliness” ఇండోర్‌కు పరిశుభ్రతలో మరోసారి కిరీటం – ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు

 Cleanliness”  న్యూఢిల్లీ, జూలై 17 
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఫలితాల్లో ఇండోర్ నగరం వరుసగా ఎనిమిదోసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికై తిరుగులేని రికార్డు సృష్టించింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గర్వించదగ్గ విజయాన్ని అందుకుంది. రాష్ట్రానికి చెందిన ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పరిశుభ్రత సర్వేలో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్నాయి.

విజయం సాధించిన నగరాలు:

  • విజయవాడ

  • తిరుపతి

  • గుంటూరు

  • గ్రేటర్ విశాఖపట్నం (GVMC)

  • రాజమండ్రి

ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా, ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్, రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు, పురపాలక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, “ఈ పురస్కారాలు రాష్ట్రానికి గర్వకారణం. దీనికి కృషి చేసిన అధికారులను, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా,” అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు.

“భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేందుకు అధికారులు, ప్రజలు సమిష్టిగా పనిచేయాలి,” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Narzo 80 Pro 5G ” రియల్‌మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!

బంపర్ ఆఫర్!
పానసొనిక్ 10W LED బ్యాటన్ (Pack of 4)
ఇప్పుడు కేవలం ₹549కే!
39% డిస్కౌంట్
కూల్ డే వైట్ లైట్ ✨
ఎనర్జీ సేవింగ్ | నమ్మకమైన బ్రాండ్

ఇంత తక్కువ ధరలో అంత మంచి క్వాలిటీ!
తడాపట్టి లైట్ మార్చేయండి!

#పానసొనిక్ #LEDలైట్స్ #హోమ్‌డీల్ #సేవింగ్
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3GJquo0 లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *