Dussehra Offer” వంద రూపాయ‌ల‌కే పొట్టేలు, మేక‌పోతు, నాటుకోడి, టీచ‌ర్స్ ఫుల్ బాటిల్

Dussehra Offer

Dussehra Offer” తెలంగాణ రాష్ట్రంలో దసరా ఫెస్టివెల్ అంటే మామూలుగా ఉండ‌దు. ఆ రోజూ ప్ర‌తి ఇంట్ల క‌చ్చితంగా మాంసం ఉండాల్సిందే స్తోమ‌త‌ను బ‌ట్టి చికెన్, మ‌ట‌న్‌, చేప‌లు ఒక్కో ర‌కంగా వండుకుని తింటారు. ప్రతి ఊర్లో పెద్ద సంఖ్యలో నాటుకోళ్లు, గొర్రెలు, మేకల‌ను కోస్తారు. కానీ ఓ ఊర్లో వినూత్నంగా ఆలోచించారు. కేవ‌లం వంద రూపాయ‌ల‌కే ల‌క్కీ డ్రా తీయండి మేక‌పోతు, పొట్టేలు, నాటుకోడి పుంజు, ఫుల్ బాటిల్‌ను గెలుచుకోండి అంటూ బ్యాన‌ర్ ఏర్పాటు చేశారు.

der

ఇది మంచిర్యాల జిల్లా బోయ‌ప‌ల్లి గ్రామ‌స్తులు వినూత్నంగా ఆలోచించారు. ఈ మేర‌కు బంపర్ ఆఫర్ ను ప్ర‌క‌టించారు. అందులో భాగంగానే ఆ గ్రామ జ‌నాలు రూ.100 కూపన్ కొనుగోలుచేయండి. లక్కీ డ్రాలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటూ బ్యాన‌ర్ క‌ట్టారు. అక్టోబర్ నెల‌10 తారీఖున డ్రా తీసి విజేతలకు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఫ‌స్ట్ ప్రైజ్ – గొర్రెపొట్టేలు, సెకండ్ ప్రైజ్ మేకపోతు, థ‌ర్డ్ ప్రైజ్‌- జానీవాకర్ ఫుల్ బాటిల్, నాలుగో ప్రైజ్ – టీచర్స్ ఫుల్ బాటిల్, ఐదో ప్రైజ్ – బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్, ఆరో గిఫ్ట్ -100 ఫైవర్స్ ఫుల్ బాటిల్, ఏడు మ‌రియు ఎనిమిది ప్రైజ్లు నాటుకోడి పుంజు, తొమ్మిది, పదో ప్రైజ్ – నాటుకోడి పెట్టను ఇస్తామ‌ని తెలిపారు. దీనికి సంబంధించిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న‌ది. ఈ ప్ర‌క‌ట‌న చూసిన ప్ర‌జ‌లు భారీ సంఖ్యలో కూపన్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే 50 శాతం కూప‌న్లు అమ్ముడు పోయాయ‌ని నిర్వాహకులు చెప్పారు.

మ‌రెన్నో క‌థ‌నాలు చ‌ద‌వాల‌నుకుంటున్నారా..? ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00 

 

ఇవి కూడా చ‌ద‌వండి

CC Camera” 360° డిగ్రీల సీసీ కెమెరా.. కేవ‌లం రూ. 2,499కే

Digital Card” రేష‌న్ బియ్యం స‌హా అన్నింటికీ ఒకటే డిజిట‌ల్ కార్డు..

Washing Machine” ప్యాన‌సోనిక్ వాషింగ్ మెషిన్ రూ. 12,490కే

Udupi Railway Station” ర‌న్నింగ్ ట్రైన్ నుంచి జారిప‌డిన మ‌హిళ‌.. కాపాడి సిబ్బంది. వీడియో

Python Crocodile Video” కొండ‌చిలువ కొరికి విసిరిన మొస‌లి.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *