Chiranjeevi Vishwambhara” విశ్వంభర: చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్‌లో సోషియో ఫాంటసీ

Chiranjeevi Vishwambhara”  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర‘పై అనేక ఊహాగానాలు మొదటి నుంచి వినిపిస్తున్నప్పటికీ, తాజాగా దర్శకుడు స్వయంగా కథలోని కీలక లైన్‌ను వెల్లడించారు.

వశిష్ఠ చెప్పిన కథ ప్రకారం—మన బ్రహ్మాండంలో మొత్తం 14 లోకాలు ఉంటాయి. పైకి 7, కిందకి 7. ఇవన్నీ ఇప్పటి వరకు సినిమాల్లో ఏదో ఒక విధంగా దర్శించబడ్డాయి. కానీ ‘విశ్వంభర‘లో మాత్రం ఈ ప్రతి లోకాన్ని అధిగమిస్తూ, చివరికి బ్రహ్మదేవుడి నివాసమైన సత్యలోకానికి కథ వెళ్లిపోతుంది.

ఇలాంటి కథకు హీరో ఎలా చేరతాడు? హీరోయిన్‌ను ఎలా తిరిగి తెస్తాడు? అనే అంశమే చిత్రానికి స్పైన్‌గా నిలుస్తుంది. అంటే ఇది ఒక విధంగా భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక లోకాల దాకా సాగే ప్రయాణం.

ఈ చిత్రాన్ని ఎంతో వైభవంగా మలచేందుకు ప్రపంచ స్థాయి VFX కంపెనీలు పనిచేస్తున్నట్లు వశిష్ఠ వెల్లడించారు. సెట్స్ విషయంలోనూ విభిన్నంగా, రియాలిటీకి దగ్గరగా రూపొందించినట్లు తెలిపారు. చిరంజీవిని ఇప్పటి వరకు చూడనట్లు చూపించబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

చిరు సరసన త్రిష, ఆషికా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ‘నాగినీ’ ఫేమ్ మౌనీరాయ్ కూడా ఓ ప్రత్యేక గీతంలో మెరిసే అవకాశం ఉందని తెలుస్తోంది. చిరంజీవి సూపర్‌హిట్‌ మూవీ ‘ఖైదీ‘లోని ‘రగులుతోంది మొగలిపొద’ పాటను రీమిక్స్ చేసి, చిరంజీవి–మౌనీ కాంబినేషన్‌లో నృత్యం చూడవచ్చని టాక్.

ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటనల కోసం కూడా ఉత్కంఠ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *