peddhi”
‘ఉప్పెన’తో టాలీవుడ్‌కు సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రం ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది.
కథా నేపథ్యంలో ముఖ్యమైన సన్నివేశాలు విజయనగరంలో చిత్రీకరించాల్సిన అవసరం ఉండగా, అక్కడ వాతావరణం షూటింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో, అదే వాతావరణాన్ని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా విలేజ్ సెట్ వేశారు. ఈ సెట్ నిర్మాణానికి చిత్ర బృందం ఏకంగా రూ. 5 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేస్తోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పైనా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇటీవల జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక ఈ సినిమాకు సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, ఇప్పటికే పలు ట్యూన్లు సిద్ధమైనట్లు సమాచారం. మాస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న కథకు రెహమాన్ మ్యూజిక్ పెద్ద ఎత్తున ఎలివేట్ చేస్తుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపికైంది. దేవర ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, వెంటనే రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది.
‘పెద్ది’ సినిమా 2025లో విడుదల కానుంది.

♂️ స్టైల్ మచ్చిక!
హవెల్స్ ట్రిమ్మర్ కేవలం ₹1,349/- కి!
➡️ 29% డిస్కౌంట్
Cord & Cordless – స్టైలిష్ బ్లూ
Li-Ion Battery – Powerful & Long-lasting
Amazon లో అందుబాటులో ఉంది! https://amzn.to/4fl8LQJలింక్ పై క్లిక్ చేయండి…
