Jewellery” బంగారం ధర రోజుకు ఆకాశాన్నంటోంది. ఒక గ్రాం కొనాలన్నా సామాన్యుడికి చుక్కలు కనపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఒక గ్రాం పోతే ఏంత బాధ ఉంటుంది.. అటువంటింది ఏకంగా 12 కోట్ల విలువైన బంగారం పోయింది. అది కూడా వర్షంతో వచ్చిన వరద కారణంగా..
ఈ ఘటన చైనాలోని షాన్షీ ప్రావిన్స్‌లో ఉన్న వూకీ కౌంటీలో జూలై 25 ఉదయం వచ్చిన హఠాత్తు వరద కారణంగా చోటు చేసుకుంది. వూకీ కౌంటీలో ఉన్న బంగారం షాప్లోకి ఒక్కసారిగా వరద దూసుకొచ్చింది. దీంతో ఆషాపులోని ప్రముఖ బంగారు ఆభరణాల షాప్ నుంచి సుమారు 20 కిలోల బంగారు, వెండి నగలు కొట్టుకుపోయాయి.
షాప్ యజమాని యే తెలిపిన వివరాల ప్రకారం… వరద వస్తున్న సమయంలో పని ప్రారంభించడానికి దుకాణానికి చేరిన Laofengxiang జ్యువెల్లరీ షాప్ తలుపు తెరిచారు. అదే సమయంలో వరద బీకరంగా వచ్చింది. ఆ సమయంలో నగలు వరదతో పాటు కొట్టుకుపోయాయని ఆయన తెలిపారు. అయితే అంతకు ముందురోజు రాత్రి బంగారాన్ని లాకర్లలో దాచలేదు. ఉదయం వరద హెచ్చరికలు వచ్చేసరికి నగలు స్టోర్‌లో ప్రదర్శనలోనే ఉండిపోయాయి.
ఒక మీటర్‌కు పైగా ఎత్తు వరద నీరు
కొద్ది నిమిషాల్లోనే నీరు షాపు ముందు నుంచి లోపలకి వచ్చి ఒక మీటర్ ఎత్తుకు చేరింది. బలమైన ప్రవాహం షాపులోని షోకేసులు, ట్రేలు మొత్తం వరదలోనే కొట్టుకుపోయాయి. బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలు, చెవి రింగులు, పెండెంట్లు, వజ్రాల ఉంగరాలు, జేడ్ ఆభరణాలు, వెండి వస్తువులు కొట్టుకుపోయినట్టు దుకాణం యాజమాని యే తెలిపారు.
అంతేకాకుండా, కొత్తగా వచ్చిన నగలు, రీసైకిల్ చేసిన బంగారం, భారీ మొత్తంలో నగదు కూడా అదృశ్యమైందని ఆయన వాపోయారు.
అంచనా విలువ: రూ.12 కోట్లు పైగా
ప్రస్తుత బంగారు, వెండి ధరల ప్రకారం, కొట్టుకుపోయిన నగల విలువ కనీసం 1 కోటి యువాన్లు ( భారత కరెన్సీలో సుమారు రూ.12 కోట్లు)గా అంచనా వేయబడుతోంది.
వెతికే యత్నాలు
షాపు యజమాని కుమారుడు షియాయే వెల్లడించిన ప్రకారం, కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది వరద అనంతరం రెండు రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. దాదాపు 1 కిలో బంగారు నగలు మాత్రమే తిరిగి లభించాయి. వాటిలో కొన్ని స్థానికులు స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చారు.
విపత్తు సమయంలో విద్యుత్ పోవడంతో షాపులోని సీసీటీవీ వ్యవస్థ పనిచేయలేదు, దాంతో నగలు ఎలా పోయాయో గానీ, ఎవరు తీసుకెళ్లారో గానీ తెలుసుకోవడం చాలా కష్టం అయ్యింది.
ప్రజలు స్వచ్ఛందంగా వెతుకుతున్న దృశ్యాలు
వార్త వెలుగులోకి వచ్చాక స్థానిక ప్రజలు మట్టిలోనూ వరద నీటి మిగిలిన భాగాల్లోనూ ఆభరణాలు వెతకడం ప్రారంభించారు. కొందరు మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి సుదీర్ఘంగా గాలించారు. సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.
A gold shop in Wuqi County, Shaanxi says around 20kg of jewelry was lost in recent floods. About 1kg has been recovered so far. Police are investigating, and local authorities are urging anyone who found gold to return it. #Shaanxi #floods pic.twitter.com/kZQsaLqJnz
— Spill the China (@SpilltheChina) July 27, 2025

ఒదోనిల్ తో మీ బాత్రూమ్ కి పరిమళ వాతావరణం!
Odonil Bathroom Air Freshener Zipper Mix
✨ 2 సూపర్ కాంబోలు:
50గ్రా (10గ్రా x 5) – Citrus, Jasmine, Rose, Lavender, Floral
30గ్రా (10గ్రా x 3) – Citrus, Jasmine, Lavender
ఒక్కసారి ఉంచితే 30 రోజులు వరకూ ఫ్రెష్ వాసన!
జర్మ్ ప్రొటెక్షన్ తో సహా
వేల మందికి రేటింగ్ – 4.3 స్టార్స్ ⭐⭐⭐⭐✰
ధరలు pocket-friendly – ఇప్పుడే ట్రై చేయండి!
https://amzn.to/46BmFM2లింక్ పై క్లిక్ చేయండి..
