Medaram Jatara” మేడారం వెళ్ల‌లేక పోతున్నారా.. ఓ గుడ్ న్యూస్

medaram jatara

Medaram Jatara”  తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల టీఆఎస్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతున్నదన్న విష‌యం తెలిసిందే. మేడారం సమ్మక్క సారలమ్మ దేవ‌త‌లను ద‌ర్శించుకోవడం వీలుకాని భక్తులకు ప్రసాదం (బంగారం) అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకోసం ఈ నెల 14 నుంచి 25 వ‌ర‌కు ప్ర‌సాదం కోసం బుకింగ్‌ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు ఎక్స్‌లో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఇలా బుక్ చేసుకున్న వారికి ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేస్తామ‌ని పేర్కొన్న‌రు. బుక్ చేసుకోవ‌డం కోసం ఆఫ్‌లైన్‌/ఆ న్‌లైన్ రెండువిధాల్లోనూ ఈ అవ‌కాశం కల్పించారు. ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచ‌న‌ల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో ఈ సేవ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్ లైన్ లో పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. ఆన్ లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ ను తప్పనిసరిగా నమోదుచేయాలని పేర్కొన్నారు.  మేడారం ప్రసాద బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఎక్స్‌లో సూచించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Mla Mallareddy” 14, 15న సెల‌వు ఇప్పించండి.. ఎమ్మెల్యే మ‌ల్ల‌న్న‌రిక్కెస్ట్‌.. న‌వ్వులు పూయిస్తున్న‌ వీడియో

విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి

Young Farmers” 45 ఏండ్లు వ‌చ్చిన పెండ్లి కావ‌డం లేదు.. ప్రోత్సాహ‌కంగా రూ. 5 లక్షలివ్వండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *