Balyyapalli” బాలయ్యపల్లిలో పంచాయతీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన
శంకరపట్నం: డీసీ ప్రతినిధి
గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు సైతం భాగస్వాములవుతుంటే అభివృద్ధి శీఘ్రంగా సాధ్యమవుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామంలో పర్యటించి, నిర్మించతలపెట్టిన నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పనులకు ప్రజల సహకారం లభిస్తే స్థిరమైన పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ సురేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, చింతల లక్ష్మారెడ్డి, గొట్టిముక్కుల సంపత్ రెడ్డి, పోలు రాము, రమేశ్, గ్రామ శాఖ అధ్యక్షులు గోదారి చిట్టిబాబు, పెంట వినోద్ కుమార్, కాసర్ల సంపత్, రొడ్డ సాగర్, తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇంటి థియేటర్ ఫీల్!
TCL 55″ 4K QLED Google TV తీసేసా!
MRP: ₹1,09,990
➡️ డీల్లో కేవలం ₹40,990కి (63% తగ్గింపు!)
4K QLED | 120Hz Refresh Rate | Dolby Atmos
గేమింగ్ కోసం 288Hz Game Accelerator
️ 2 ఏళ్ల వారంటీ + Free Open Box Inspection
ఇంట్లోనే సినిమాల థియేటర్ ఫీల్!
ఎవరు అయినా TV తీసుకోవాలంటే… అమెజాన్లో కొనేందుకు
లింక్ https://amzn.to/4fvc9Z7 పై క్లిక్ చేయండి
