Albendazole-warangal” నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యం – డాక్టర్ మేరుగు యశస్విని

Albendazole-warangal”  జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాత్రల పంపిణీ

శంకరపట్నం: డీసీ ప్రతినిధి

నులిపురుగుల నివారణ ద్వారా మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలమని ఎన్ఎల్ఈపీ, హెచ్‌ఐవి-ఎయిడ్స్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మోహన్ సింగ్ పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం వరంగల్ జిల్లాలోని ఏవీవీ హైస్కూల్ మరియు ఆంధ్ర బాలిక ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసే ప్రక్రియను వివరించారు.

మాత్రల పంపిణీ విధానం:

  • 1 నుంచి 2 సంవత్సరాల చిన్నారులకు భోజనం అనంతరం అల్బెండజోల్ సగం మాత్ర

  • 3 నుండి 19 సంవత్సరాల విద్యార్థులకు భోజనం అనంతరం ఒక పూర్తి అల్బెండజోల్ మాత్ర ఇవ్వాలని సూచించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మేరుగు యశస్విని కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డిపిహెచ్ఎన్ఓ మనోజ్, డీఏపీసీయు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ స్వప్న మాధురి, ఐసీటీసీ సూపర్వైజర్ అడేపు రామకృష్ణ, జిల్లా అసిస్టెంట్ కమలాకర్, యూఎఫ్‌డబ్ల్యూసీ ఎంజీఎంపీపీ సూపర్వైజర్ నర్మద, ఏఎన్ఎంలు లక్ష్మీబాయి, రాజ సులోచన, ఆశ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *