Og Movie”
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముహూర్తం దసరా కానుకగా ఖరారవ్వడంతో అభిమానుల్లో మిన్నంటుతున్న ఉత్సాహం మరింత పెరిగింది.
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ, సినిమాటిక్ షెడ్యూల్స్ వల్ల చిత్ర నిర్మాణంలో ఆలస్యం జరిగినప్పటికీ, చివరకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఓవర్సీస్లో ఈ సినిమా ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేయనుండగా, ఇప్పటికే టికెట్లకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
వినిపిస్తున్న కథా సంగతుల ప్రకారం, ముంబై అండర్‌వర్డ్ నుంచి మాయం అయిన ఓజస్ గంభీర్ అనే గ్యాంగ్‌లీడర్, తిరిగి వచ్చి తన శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు, సామ్రాజ్యాన్ని మళ్లీ ఎలా ఆధీనంలోకి తెచ్చుకున్నాడనేది కథాంశంగా ఉండొచ్చని సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
వినాయక చవితి సందర్భంగా విడుదలైన “సువ్వి సువ్వి” పాటకు మంచి స్పందన లభించింది. పవన్ కళ్యాణ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు బాగా నచ్చడంతో పాటకు వేలాది లైక్స్ వచ్చాయి.
