Boja Ganapayya” మహిళల కుంకుమ పూజ, అన్నప్రసాద వితరణ
శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు, మహిళల కుంకుమ పూజలు, అన్నప్రసాద వితరణలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
మొలంగూర్, కన్నాపూర్, ధర్మారం, గద్దపాక, కేశవపట్నం, తాడికల్, కొత్తగట్టు, కరీంపేట్, అంబాలాపూర్, అందాలపల్లి, లింగాపూర్ వంటి గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మహిళలు గణపయ్యకు కుంకుమ పూజలు నిర్వహించగా, ఉత్సవ కమిటీ సభ్యులు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక గణేష్ ఉత్సవ కమిటీలు, తాజా మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఉత్సవ శోభలు కనిపించాయి.
