బస్టాండ్ చౌర‌స్తాలో అవ‌గాహ‌న
కరీంనగర్, మదర్ న్యూస్ ప్రతి నిది:
కరీం నగర్ జిల్లా ఉప రవాణాశాఖ అధికారి పి.పురుషోత్తం గారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2026 కు సంబంధించిన రెండవ రోజు కార్యక్రమం కరీం నగర్ పట్టణ బస్ స్టాండ్ చౌరస్తాలో జరిగినది. ఈ కార్య కార్యక్రమం లో భాగం గా ఏభై వాహనాల ను తనిఖీ చేయగా అందులో, 35 కార్ల డ్రైవర్లు సీట్ బెల్ట్ లను ధరించకపోవడం గమనార్హం.
కారు ప్రమాదాల్లో సీటు బెల్ట్ ధరించనందుననే అధిక శాతం మంది డ్రైవర్లు మరణిస్తున్నందున వాహనాల డ్రైవర్ల కు సీటు బెల్టు ధరించడం పై అవగాహన కలిగించడం తో పాటు పువ్వుల ను ఇచ్చి చైతన్య పరచడం జరిగింది.
ఈ కార్యక్రమం లో డి.టి.ఓ శ్రీకాంత్ చక్ర వర్తి, యమ్.వి.ఐ రవికుమార్, ఏ.యమ్.వి.ఐ హరిత లతో పాటు రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలం సంపత్ రవాణాశాఖ సిబ్బంది మరియు ట్రాఫిక్ పోలీస్ యస్.ఐ .ఆఫ్ పోలీస్ ప్రసాద్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు
కరీంనగర్, మదర్ న్యూస్ ప్రతి నిది :
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2026 లో భాగం గా
రవాణాశాఖ కరీం నగర్ ఆధ్వర్యం లో వాహన ఛోదకుల కు సీట్ బెల్ట్ పై అవగాహన కార్యక్రమం జరిగింది.
ముందుగా రేణికుంట టోల్ ప్లాజా సమీపంలో జరిగిన అవగాహన కార్యక్రమం లో భాగం గా అరవై కార్ల డ్రైవర్ల ను తనిఖీ చేయగా 45 మంది డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించనందున సీట్ బెల్ట్ ధరించక పోవడం మూలం గా వాహనాల ఛోదకులు తమ విలువైన ప్రాణాల ను కోల్పోతున్నందున ప్రతి వాహన డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించాలనే అవగాహన ను కలిగించడం లో భాగం గా పువ్వుల ను బహూకరించి చైతన్య పరచడం జరిగింది.
ఈ కార్యక్రమం లో డి.టి.ఓ
శ్రీకాంత్ చక్ర వర్తి, జిల్లా ఆర్.టి.ఏ మెంబర్ రాహుల్ కుమార్, యమ్.వి.ఐ.రవి కుమార్, ఏ.యమ్.వి.ఐ లు స్రవంతి ,హరితలు మరియు రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ కో ఆర్ఢినేటర్ డాక్టర్ నీలం సంపత్ ,రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

రైతుల అవసరాలకు తగిన రుణాలు అందించాలి..

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్
కరీంనగర్, మదర్ న్యూస్ ప్రతి నిది:
రైతుల అవసరాలకు తగిన విధంగా బ్యాంకర్లు రుణాలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ (రెవెన్యూ) పేర్కొన్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయడంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను బ్యాంకర్లు వివిధ శాఖల అధికారులు నిర్ణయించాలని సూచించారు. పంటల సాగులో ఖర్చులు పెరిగిన దృష్ట్యా గత సంవత్సరం కంటే సేల్ ఆఫ్ ఫైనాన్స్ ను కొంతవరకు పెంచాలని అభిప్రాయపడ్డారు వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు గోధుమలు కూరగాయలు చిరుతృణధాన్యాలు జొన్న రాగులు, నగదు పంటలకు అధిక రుణ పరిమితినీ కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, రైతులకు రుణాల మంజూరు, ఫైనాన్సింగ్ విధానం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా పంటలకు సంబంధించి పంటల సాగులో పెట్టుబడులు ఆదాయము తో పాటు వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో 20 మంది రైతులు పాల్గొని సేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచే అంశంపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ రావు కరీంనగర్ ఎల్డిఎం ఆంజనేయులు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పెద్దపల్లి, సిరిసిల్ల జగిత్యాల జిల్లాల నాబార్డ్ అధికారులు వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక మత్స్య శాఖ అధికారులు కేడిసిసి బి అధికారులు, బ్యాంకర్లు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్, మదర్ న్యూస్ ప్రతి నిది:
2025-26 ఆర్థిక సంవత్సరమునకు గాను మేరా యువభారత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు సంబంధించి క్రీడా సామాగ్రి కొరకు యువజన సంఘాల నుండి దరఖాస్తులు గడువు పొడిగించడమైనది. క్రీడా సామాగ్రి కొరకు దరఖాస్తు చేసుకునే యువజన సంఘాలు రిజిస్టర్డ్ అయి ఉండాలి, యువజన సంఘం లో సభ్యులు 18 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. క్రీడా సామాగ్రికి దరఖాస్తు తో యువజన సంఘము రిజిస్ట్రేషన్ కాఫీ జిరాక్స్ తో పాటుగా వారి యొక్క బైలాస్ కాపీని కూడా జత చేయాలి, అదే మాదిరిగా గత ఐదు సంవత్సరాల నుంచి వారు చేసినటువంటి కార్యక్రమాల పత్రికా ప్రకటనలు, ఫోటోలు జత చేయాలి. దరఖాస్తు ప్రొఫార్మా మేరా యువభారత్ కరీంనగర్ జిల్లా ( బస్టాండ్ ఎదురుగా) కార్యాలయం నుండి పొందవచ్చును. ఈ సంవత్సరము మొత్తము కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు 120 సంఘాలకు క్రీడా సామాగ్రి అందజేయబడును. అందులో కరీంనగర్ జిల్లాకు 30, పెద్దపల్లి జిల్లాకు 30, జగిత్యాల జిల్లాకు 30 మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాకు 30. ఆసక్తి కలిగిన యువజన సంఘాలు జనవరి 09, 2026 సాయంత్రం ఐదు గంటల లోపల మేరా యువభారత్ కరీంనగర్ జిల్లా కార్యాలయము లో (బస్టాండు ఎదురుగా) అందజేయగలరు.ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *