Municipal-election”పాత కరీంనగర్ జిల్లా మున్సిపల్ రిజల్ట్స్: ఎక్క‌డ ఎవ‌రిది పీఠం

Municipal-election”

కరీంనగర్, ఫిబ్రవరి 16: పాత కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నికల పర్వం ముగిసింది. ఉదయం నుండి ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో పలువురు కొత్త నాయకులు పీఠం దక్కించుకోగా, కొన్ని చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరి ఏయే పట్టణంలో ఎవరెవరు విజయకేతనం ఎగురవేశారో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

  • క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌ కొలగాని శ్రీనివాస్

  • కరీంనగర్, మేయర్‌గా కొలగాని శ్రీనివాస్: ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలో 34 ఓట్లు సాధించి కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ నూతన మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

  • డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్ రావు: ఇదే 34 ఓట్ల మెజారిటీతో డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు.

రామగుండం కార్పొరేషన్: మేయర్‌గా మహంకాళి స్వామి

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది.

  • మేయర్: మహంకాళి స్వామి

  • డిప్యూటీ మేయర్: పాతపల్లి ఎల్లయ్య రామగుండం నగర అభివృద్ధికి వీరు కొత్త సారధులుగా ఎన్నికయ్యారు.

రాజన్న సిరిసిల్ల: జిందం కళ ఏకగ్రీవం

సిరిసిల్ల మున్సిపాలిటీలో మహిళా నాయకత్వానికి పట్టం కట్టారు. చైర్ పర్సన్‌గా జిందం కళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ పీఠాన్ని దార్ల సందీప్ దక్కించుకున్నారు. నేతన్నల పట్టణంలో కొత్త పాలకవర్గంపై భారీ అంచనాలు ఉన్నాయి.

వేములవాడ: పుల్కం రాజు  

శివనామస్మరణతో మారుమోగే దక్షిణ కాశీ వేములవాడలో పుల్కం రాజు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో ఆయనకు 17 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడం గమనార్హం. ఇక వైస్ చైర్మెన్‌గా నరాల శేఖర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

జగిత్యాల చైర్‌ప‌ర్స‌న్‌గా  సమిండ్ల వాణి 

మున్సిపల్ చైర్‌పర్సన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సమిండ్ల వాణి జగిత్యాల మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

ధర్మపురి   మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి

  • మున్సిపల్ చైర్‌పర్సన్: వేముల నాగలక్ష్మి (రాజేష్)

  • మున్సిపల్ వైస్ చైర్మన్: ఇందారపు రామయ్య (రామన్న)

  • రాయికల్‌లో  ..

  • మున్సిపల్ చైర్మన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కట్కమ్ రవీందర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

  • వైస్ చైర్ పర్సన్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన తురగా సౌజన్య వైస్ చైర్ పర్సన్ పదవిని కైవసం చేసుకున్నారు.

జమ్మికుంట ..

  • మున్సిపల్ చైర్మన్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొలుగు ప్రశాంత్ కుమార్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • వైస్ చైర్మన్: వైస్ చైర్మన్ పదవిని ఏడీ మహమ్మద్ (ముంతాజ్ అలీ)

  • చొప్పదండి..

  • మున్సిపల్ చైర్‌పర్సన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన వడ్లూరి సరిత చొప్పదండి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

  • మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్: వైస్ చైర్‌పర్సన్‌గా పెరుమాండ్ల  మాన‌స‌ గంగయ్య ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *