Municipal-election”
కరీంనగర్, ఫిబ్రవరి 16: పాత కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నికల పర్వం ముగిసింది. ఉదయం నుండి ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో పలువురు కొత్త నాయకులు పీఠం దక్కించుకోగా, కొన్ని చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరి ఏయే పట్టణంలో ఎవరెవరు విజయకేతనం ఎగురవేశారో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
-
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్
-
కరీంనగర్, మేయర్‌గా కొలగాని శ్రీనివాస్: ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలో 34 ఓట్లు సాధించి కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ నూతన మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
-
డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్ రావు: ఇదే 34 ఓట్ల మెజారిటీతో డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు.
రామగుండం కార్పొరేషన్: మేయర్‌గా మహంకాళి స్వామి
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది.
-
మేయర్: మహంకాళి స్వామి
-
డిప్యూటీ మేయర్: పాతపల్లి ఎల్లయ్య రామగుండం నగర అభివృద్ధికి వీరు కొత్త సారధులుగా ఎన్నికయ్యారు.
రాజన్న సిరిసిల్ల: జిందం కళ ఏకగ్రీవం
సిరిసిల్ల మున్సిపాలిటీలో మహిళా నాయకత్వానికి పట్టం కట్టారు. చైర్ పర్సన్‌గా జిందం కళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ పీఠాన్ని దార్ల సందీప్ దక్కించుకున్నారు. నేతన్నల పట్టణంలో కొత్త పాలకవర్గంపై భారీ అంచనాలు ఉన్నాయి.
వేములవాడ: పుల్కం రాజు
శివనామస్మరణతో మారుమోగే దక్షిణ కాశీ వేములవాడలో పుల్కం రాజు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో ఆయనకు 17 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడం గమనార్హం. ఇక వైస్ చైర్మెన్‌గా నరాల శేఖర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
జగిత్యాల చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి
మున్సిపల్ చైర్పర్సన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సమిండ్ల వాణి జగిత్యాల మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి
-
మున్సిపల్ చైర్పర్సన్: వేముల నాగలక్ష్మి (రాజేష్)
-
మున్సిపల్ వైస్ చైర్మన్: ఇందారపు రామయ్య (రామన్న)
-
రాయికల్‌లో ..
-
మున్సిపల్ చైర్మన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కట్కమ్ రవీందర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
-
వైస్ చైర్ పర్సన్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన తురగా సౌజన్య వైస్ చైర్ పర్సన్ పదవిని కైవసం చేసుకున్నారు.
జమ్మికుంట ..
-
మున్సిపల్ చైర్మన్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొలుగు ప్రశాంత్ కుమార్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
-
వైస్ చైర్మన్: వైస్ చైర్మన్ పదవిని ఏడీ మహమ్మద్ (ముంతాజ్ అలీ)
-
చొప్పదండి..
-
మున్సిపల్ చైర్పర్సన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన వడ్లూరి సరిత చొప్పదండి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
-
మున్సిపల్ వైస్ చైర్పర్సన్: వైస్ చైర్‌పర్సన్‌గా పెరుమాండ్ల మానస గంగయ్య ఎన్నికయ్యారు.
