కరీంనగర్: దేశాన్ని క్షయ వ్యాధి రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో 14 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీబీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ఆదేశాలు
కేంద్ర టీబీ నిర్మూలన విభాగం (న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్యాధికారి (DM&HO) వెంకటరమణ, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి ఈ సమీక్షలో భాగస్వాములయ్యారు.
49 గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు
జిల్లావ్యాప్తంగా గుర్తించిన 49 గ్రామాల్లో ఈ నెల 24 నుంచి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ గ్రామాల్లో నివసించే 14 సంవత్సరాల పైబడిన వారందరికీ విధిగా టీబీ పరీక్షలు చేయాలని కేంద్ర విభాగం ఆదేశించింది. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
ఉచిత పరీక్షలు.. ఉచిత మందులు
ఈ సందర్భంగా జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు:
-
క్షయ వ్యాధి పట్ల అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి.
-
ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ పరీక్షలు పూర్తిగా ఉచితం.
-
వ్యాధి నిర్ధారణ అయిన వారికి అత్యంత ఖరీదైన మందులను కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తుంది.
- ఇవి కూడా చదవండి
మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
కరీంనగర్ పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’: రూ. 139 కోట్ల సైబర్ మోసం గుట్టురట్టు!
ఫిన్లాండ్ టీచర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌కు ఇల్లంతకుంట ఉపాధ్యాయుడు మహేష్ చంద్ర ఎంపిక!
