RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు.. ప‌దోత‌ర‌గ‌తితో ద‌ర‌ఖాస్తు విధానం ఇదే

rrb jobs

ఉద్యోగార్థులకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ భారీ నోటిఫికేషన్‌తో ముందుకు వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (CEN No. 02/2026) విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,565 టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్), టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 30, 2026 నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రారంభం: జూన్ 30, 2026

  • దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 29, 2026

ఖాళీలు మరియు విద్యార్హతల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రెండు రకాల కేటగిరీలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు:

పోస్టు పేరు ఖాళీల సంఖ్య విద్యార్హత
టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ 323 సంబంధిత విభాగంలో బీఎస్సీ (BSc) డిగ్రీ లేదా డిప్లొమా
టెక్నీషియన్ గ్రేడ్ III 6,242 పదో తరగతి (Class 10) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) సర్టిఫికేట్

వయోపరిమితి (జూలై 1, 2026 నాటికి)

  • టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్: 18 నుండి 33 సంవత్సరాలు.

  • టెక్నీషియన్ గ్రేడ్ III: 18 నుండి 30 సంవత్సరాలు.

  • వయోసడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ (SC, ST, OBC, PWD) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  • జనరల్ / OBC / EWS అభ్యర్థులకు: రూ. 500

  • SC / ST / PWD అభ్యర్థులకు: రూ. 250

ఎంపిక విధానం

అభ్యర్థులను క్రింది మూడు దశల పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది:

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): మొదటగా ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు.

  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ సాధించిన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలిస్తారు.

  3. మెడికల్ ఎగ్జామినేషన్: రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా?

అర్హులైన అభ్యర్థులు క్రింది స్టెప్స్ ఫాలో అయి అప్లై చేసుకోవచ్చు:

  1. మొదటగా అధికారిక RRB అప్లికేషన్ పోర్టల్‌ను సందర్శించండి.

  2. మీ ప్రాథమిక వివరాలతో కొత్త అకౌంట్ క్రియేట్ (రిజిస్ట్రేషన్) చేసుకోండి.

  3. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి.

  4. మీ ఆధార్ వివరాలను ఎంటర్ చేయండి (ఇవి మీ పదో తరగతి సర్టిఫికేట్‌లోని వివరాలతో సరిపోలాలి).

  5. అవసరమైన విద్యార్హత పత్రాలు, ఫోటో మరియు సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

  6. నెట్ బ్యాంకింగ్/డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి.

  7. చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

ముఖ్య గమనిక: అభ్యర్థులు ప్రతి పే లెవెల్‌కు కేవలం ఒక రైల్వే బోర్డు (RRB)కు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒకే పే లెవెల్‌లో ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు పెడితే, అవి తిరస్కరణకు గురవుతాయి. కాబట్టి దరఖాస్తు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.