జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. జగిత్యాల నుండి కూకట్‌పల్లికి నేరుగా సరికొత్త సూపర్ లగ్జరీ బస్ సర్వీసులను జగిత్యాల డిపో మేనేజర్ అధికారికంగా ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బస్సు వేళల వివరాలు (Timings):
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతిరోజు రెండు విడతలుగా ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ వివరాలు వెల్లడించారు.
-
జగిత్యాల నుండి కూకట్‌పల్లికి:
-
మొదటి సర్వీస్: తెల్లవారుజామున 3:00 గంటలకు
-
రెండో సర్వీస్: మధ్యాహ్నం 3:00 గంటలకు
-
-
కూకట్పల్లి నుండి జగిత్యాలకు:
-
మొదటి సర్వీస్: ఉదయం 9:00 గంటలకు
-
రెండో సర్వీస్: రాత్రి 9:30 గంటలకు
-
ఈ బస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగిత్యాల డిపో మేనేజర్‌తో పాటు ట్రాఫిక్ సీఐ (Traffic C.I), ఎస్.టి.ఐ (STI) మరియు ఇతర ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సర్వీసులు ప్రారంభం కావడం పట్ల స్థానిక ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్లో లోటు వర్షపాతం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా
వేములవాడలో దొంగల ముఠా గుట్టురట్టు.. చోరీల నియంత్రణపై పోలీసుల ఉక్కుపాదం!
రైతులకు గుడ్ న్యూస్: ఇకపై ‘మీసేవ’ కేంద్రాల్లోనే యూరియా బుకింగ్.. ఎలాగో తెలుసుకోండి!
