ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. గురువారం ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొన్న ప్రమాదంలో నిన్న ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరు కూలీలు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు.
ప్రమాద వివరాలు:
అనుపురం వద్ద ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద సమయంలో టాటా ఏస్ వాహనంలో మొత్తం 23 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్నారు.
ప్రమాద తీవ్రతకు ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఇద్దరు కూలీలు శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించడంతో వలస కూలీల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఇద్దరు కూలీలు మృతి.. మూడుకు చేరిన మృతుల సంఖ్య..
