Film celebrities” వ‌ర‌ద బాధితుల‌కు సినీ ప్ర‌ముఖుల విరాళాలు

Film celebrities

Film celebrities” జూనియర్‌ ఎన్టీఆర్ రూ. కోటి విరాళం
రెండు తెలుగు రాష్ట్రాల‌ను వ‌ర‌ద ముంచెత్తింది. ఎంతో మంది సామాన్య ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. స‌హాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్ర‌భుత్వాలు రంగంలోకి సాయం చేస్తున్నాయి. ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, పెద్ద‌లు త‌మ ఔద‌ర్యాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్ర‌ముఖులు విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వనీదత్ రూ. 25 లక్షలను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు విరాళం ఇస్తున్న‌ట్టు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు రూ. కోటి విరాళంగా హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇస్తున్న‌ట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. వరద భీభత్సం త‌న‌ను ఎంతో క‌లిచివేసిందని రాసుకొచ్చారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎం సహాయ నిధికి చెరో రూ. 50 లక్షలను విరాళంగా అంద‌జేస్తున్నాన‌ని’ అని ఎక్స్‌లో హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ప్రకటించారు. విశ్వక్‌ సేన్‌ రూ. 5 లక్షలను వరద బాధితుల స‌హాయం కోసం ఆంధ్ర‌ప్రదేశ్‌కు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా అంద‌జేశారు. రూ. 50 లక్షలను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధిప‌తి సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు), సూర్యదేవర నాగవంశీ విరాళంగా ప్రకటించారు. మ‌రికొంత మంది సినీ ప్ర‌ముఖులు విరాళాలు ఇస్తూ త‌మ ఔద‌ర్యాన్ని చాటుకుంటున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Vijayawada” పీక‌ల్లోతు నీరు.. పెట్టెలో చంటి బిడ్డ‌.. వీడియో

Medak Police” ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన వ్య‌క్తిని కాపాడిన మెద‌క్ పోలీసులు.. వీడియో

Royal Bengal Tiger Video” ఎలుగుబంటి, చిరుత‌పులి కొట్లాటలో.. పులి పారిపోయింది.. వీడియో వైర‌ల్

Hyderbad crime news” మెరుపు వేగంతో ఢీ .. గాల్లో ఎగిరిప‌డ్డ యువ‌తి వీడియో

Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *