నందరమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పరిచయం అక్కర్లేని పేరు. వెండి తెరను కొన్నేళ్లపాటు ఏలారు. ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన దైన ముద్ర వేశార. తెలుగు రాజకీయాల్లో తన కంటూ ఓ ప్రత్యేకతను సృష్టించారు. పార్టీ స్థాపించిన కొన్ని రోజుల్లోనే అధికారం చేపట్టారు. నందమూరి తారక రామారావు వందో జయంతి ని పురస్కరించుకుని సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో ముద్రించిన 100 రూపాయల స్మారక నాణాలను మంగళవారం నుంచి మింట్‌లో విక్రయించనున్నారు. ఈ నాణేలను రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఉదయం ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము విడుదల చేశారు. తారకరామారావు స్మారక కాయిన్న్‌ను హైదరాబాద్ మింట్‌లో ముద్రించారు. రేపటి నుంచి (మంగళవారం) నాణాన్ని అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు. మొదటి విడతలో పన్నెండు వేల నాణాలను అందుబాటులో ఉంచనున్నారు.
ఆన్‌లైన్‌లో కూడా వీటిని కొనుక్కోవచ్చు. ఈ లింక్‌ను ఉపయోగించి కొనుక్కోవచ్చు. https://www.indiagovtmint.in/en/commemorative-coins/