సిద్ధిపేట‌లో కోకాకోల విస్త‌ర‌ణ

2500 కోట్లకు చేరనున్న పెట్టుబుడులు 

కోకాకోల సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. సిద్దిపేటలోని ప్లాంట్‌ను మరింత విస్తరించాలని కోకాకోలా సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో కొకాకోలా సంస్థ తన ప్రణాళికను తెలియజేసింది. తమ సంస్థకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌ భారత్‌ అని.. ఇక్కడ తమ వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించే వ్యూహంలో ముందుకు పోతున్నామని కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్‌ మేక్‌ గ్రివి తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ఆయన మంత్రి కేటీఆర్‌కి తెలియజేశారు. సిద్దిపేటలోని ఎక్ష్మి-లాంట్‌ను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. కరీంనగర్‌ లేదా వరంగల్‌ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలియజేసింది. ప్రతిపాదిత నూతన తయారీ ఎక్ష్మి-లాంట్‌ పెట్టుబడితో కలుపుకుంటే తెలంగాణలో కోకాకోలా సంస్థ దాదాపుగా 2500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుందని కోకాకోలా సంస్థ మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. తెలంగాణ రాష్టాన్రికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకవైపు ఐటీ, ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ అనుబంధ రంగాలే కాకుండా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని అన్నారు. తాజాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ కోకాకోలా తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండో తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు మేక్‌ గ్రీవికి మంత్రి కేటీఆర్‌ హావిూ ఇచ్చారు.

చ‌దవండి ఇవి కూడా……….

ఇక సూర్యుడి సంగ‌తి తేలుస్తాం..

చంద్రుడిపై ప్రజ్ఞాన్‌ చక్కర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *