- .ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ నిర్ధారణ
నెల రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని పెర్త్ సముద్ర తీరానికి ఒక గుర్తు తెలియని వింత వస్తువు ఒకటి కొట్టుకొచ్చింది. ఆ వస్తువుపై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అది గహంతర వాసులదని, స్పేస్ నుంచి వచ్చిన శకలమని రకరకాలుగా వర్ణించారు. ఎట్టకేలకు దాని మిస్టరీ వీడింది. ఇప్పుడు ఆస్ట్రేలియా స్పేస్ అధికారులు స్పష్టతనిచ్చారు. ఆ వస్తువు భారత రాకెట్ శకలమని తేల్చారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్కు చెందిన మూడవ స్థాయి వ్యర్థమని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. 2.5 మీటర్ల 2.5 వెడల్పుతో ఉన్న ఆ వస్తువును నెల రోజుల నుంచి పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు.
We have concluded the object located on a beach near Jurien Bay in Western Australia is most likely debris from an expended third-stage of a Polar Satellite Launch Vehicle (PSLV).
The PSLV is a medium-lift launch vehicle operated by @isro.
[More in comments] pic.twitter.com/ivF9Je1Qqy— Australian Space Agency (@AusSpaceAgency) July 31, 2023