ఎన్ని చట్టాలు తెచ్చినా..ఎన్ని అవగాహన సదస్సు పెట్టినా కొంతమంది దుర్మార్గులు మాత్రం మారడం లేదు. మూడో సారి ఆడపిల్ల పుట్టిందని పసికందు నోట్లో పొగాకు కుక్కి తండ్రి చంపిన ఘటన మహారాష్ట్ర లోని జల్‌గావ్ జిల్లాలో చోటు చేసుకుంది. పహూర్ పోలీస్ స్టేషన్ కు పరిధిలోని హరినగర్ తండాకు చెందిన గోకుల్ యాదవ్ (30) ఇది వరకే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ క్రమంలో తన భార్యకు మూడో కాన్పులో ఆడపిల్ల జన్మించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. కుమారుడు పుట్టలేదన కోపం కట్టలు తెంచుకుంది. కన్న తండ్రి మమకారాన్ని మరిచిపోయి కసాయిలా ప్రవర్తించాడు. పసికందు నోట్లో పొగాకు కుక్కి ఆయువు తీశాడు. తరువాత మృతదేహానికి ఎవరికీ తెలియకుండా అంత్య క్రియలు చేశాడు. ఆ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త శిశువు జనాన్ని నమోదు చేసుకునేందుకు గోకుల్ నివాసానికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Check Also
Sony BRAVIA HD Ready TV” సోనీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ 32 ఇంచుల టీవీ 23 వేలకే..
Sony BRAVIA HD Ready TV” మంచి బ్రాండెడ్ కంపెనీ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా.. సోనీ నుంచి 80 సెం.మీలు …
Power Bank” టాటా వారి పవర్ బ్యాంక్ రూ.689లకే
Power Bank” టాటావారి పవర్ బ్యాంక్ 989 రూపాయలకే అందుబాటులో ఉంది. పోర్ట్రోనిక్స్ ఇండో 10s 10000mAh పవర్ బ్యాంక్ …