తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఇదే సమయంలో కేంద్రం జమిలీ ఎన్నికలకు తెరలేపింది. ఈనేపథ్యంలో తెలంగాణాలో ఎన్నికలు ఎప్పడు జరుగుతాయనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు కదులుతున్నాయి.. ఎవరికి వారు తమ పట్టు నిలుపుకోవాలన్న ప్రయత్నంలో బలసవిూకరణలకు సిద్దం అవుతున్నారు. సభలు సమావేశాలతో పార్టీలు హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తూ గతంలో చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తుంది. ఒకే సారి తెలంగాణాలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. కరువు నేల పాలమూరు జిల్లాకు సాగు నీరందించేందుకు చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధినిచేసి చూపిస్తున్నమంటూ బీఆర్ ఎస్ మూడో సారి అధికారం చేపట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించింది.
ఇక కర్ణాటక ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ తెలంగాణాలోనూ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం శాయశక్తులు ఒడ్డుతోంది. గతంలో కాంగ్రెస్‌లో వివాదాలు ఉంటుండే. ఎవరికి వారుఅన్నట్టు ఉంటుండే . ఆ పార్టీలోనే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేవాళ్లు. కానీ దీనిపై హైకమాండ్ సీరియస్‌గా దృష్టి సారించడంతో ఇప్పుడు ఆ వివాదాలు సద్దుమణిగాయి. అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు.
మరో వైపు బీఆర్ ఎస్ , బీజేపీలోని అసంతృప్తులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లో చేరారు. తుమ్మల కూడా చేరుతున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణాను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇక కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. గతంతో పోల్చుకుంటే కొంత ఊపుతగ్గినప్పటికీ అధికారం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తుంది. అగ్రనాయకత్వం కూడా తెలంగాణా పై దృష్టిసారించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. దక్షిణాదిలో పాగావేయాలనుకుంటున్న బీజేపీకి తెలంగాణను ఒక సువర్ణ అవకాశంగా భావిస్తోంది. ఇటీవలే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి అధికార బీఆర్ ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు పలు నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మునుపటి ఊపు తీసుకొచ్చి బీజేపీని అధికారంలో తేవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరుగుతాయా..? జమిలీ ఎన్నికలు వస్తాయా.. అన్నది వేచి చూడాలి..? ఇప్పుడు స్థంభ్దంగా ఉన్న పార్టీ ముందు ముందు లీడ్‌కు రావొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.