గ్రహంతర వాసులు( ఏలియన్స్) గురించి ఎప్పటి నుంచో చర్చలు జరగుతున్నాయి. అసలు భూమికాకుండా ఇతర గ్రహలమీద జీవం ఉందా అనే విషయమే ఇప్పటి వరకు కన్ఫామ్ కాలేదు. కానీ మనిషిని పోలినటువంటి మరో జీవి ఉంటుందా..? ఉంటే మనిషికంటే తెలివైనజీవిగా ఉంటుందా.. అనే ప్రశ్నలు శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. అదే సమయంలో సగటు మానవుడు కూడా గ్రహంతర వాసుల గురించి ఆలోచిస్తున్నడు. ఈ నేపథ్యంలో మెక్సికలో దొరికి అస్థిపంజారాలు ఎలియన్స్‌వేనని ఆ దేశ పరిశోధకులు తెలిపారు. ఈ మానవేతర ఆవశేషాలను మెక్సికో పార్లమెంట్‌లో ప్రదర్శించారు. తాజాగా వైద్యుల పరిశోధనలో వీటిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ఏలియన్లు భూమిపై జీవించి ఉన్నవేనని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఓ ఆడ ఏలియన్ కడుపులో గుడ్లు
కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి ఏండ్ల క్రితంనాటి అవశేషాలుగా కార్బన్ డేటింగ్ విధానంలో కనుగొన్నారు. మెక్సికో శాస్త్రవేత్తలు గ్రహాంతర శవాలపై ప్రయోగశాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ పరీక్షలు పూర్తి చేశారు. ఈ ఏలియన్ల పుర్రెలు అతికించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. భూమిపై ఏ ఇతర జంతువుతో పోలి లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకదాని కడుపులో గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. రెండు అవశేషాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని మెక్సికన్ జర్నలిస్ట్ ధీర్ఘకాల ఔత్సాహికుడు జైమ్ మౌసన్ పేర్కొన్నారు. ఒక్కోదాని చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు వెల్లడించారు. అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఆ అవశేషాలపై కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధనలు చేశారు. అవి 1000 ఏళ్లనాటివని తేలినట్లు తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. భూమిపై ఒకప్పుడు జీవం ఉన్న, జీవ సంబంధమైన, గర్భధారణ కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.
‘విూ గమ్యం భారత్.. కెనడా వదిలి భారతదేశానికి వెళ్ళండి
మహిళా రిజర్వేషన్ బిల్లు.. 1996నుంచి ఇప్పటిదాక
https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00