Isro News” భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనతను సాధించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో మొక్కలు మొలకెత్త గలవా అనే ప్రయోగం విజయం సాధించింది. అంతరిక్షంలో వ్యోమనౌక అనుసంధానం కోసం ఇటీవల ప్రయోగించిన స్పెడెక్స్ విజయవంతమైన విషయం తెలిసిందే. వ్యోమనౌక అనుసంధానం తో పాటు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మాడ్యూల్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో విత్తనాలు మొలుస్తాయా..? మొలిస్తే ఆకులను పూర్తిస్థాయిలో సంతరించుకుంటాయా..? అని తెలుసుకునేందుకు చేపట్టిన ప్రయోగంతో పాటు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఏ స్తాయిలో ఉన్నాయో కొలిచేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. అయితే స్పెడెక్స్ కోసం నింగిలోకి పంపిన జంట శాటిలైట్లతో పాటు కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ పేలోడ్ ను స్పేస్‌లో పంపింది. దీంట్లో 8 అలసంద విత్తనాలను పెట్టారు. ఇటీవల కాలంలో అవి మొలకెత్తాయి. దాంతో పాటు తాజాగా ఆకులను సంతరించుకున్నాయి. ఈ ఘటనపై (Isro) ఇస్రో సైంటిస్టుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఆకులు వచ్చినప్పుడు మాడ్యుల్‌లో ఆర్ధత, ఉష్ణోగ్రత, మట్టిలో తేమ తదితర విషయాలను మాడ్యుల్‌లో అమర్చిన
కెమెరా, ఇతర ఉపకరణాలతో కొలిచామని (Isro) ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రయోగం అంతరిక్షంలో మొక్కల పెంపకానికి సంబంధించి మరింత (Research) రీసెర్చ్‌లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతరిక్షంలో గడిపే వ్యోమగాముల ఆహార అవసరాలను భవిష్యత్‌లో తీర్చేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని వారు తెలిపారు. ఏ మేరకు నీరవసరం, చెట్ల పెంపకం, ఆకులు, ఫలాలు ఇవ్వగలవు తదితరల అంశాలపై శోధనకు తాజా ప్రయోగం సాయపడినట్టు ఇస్రో వివరించింది.
#ISRO releases the timelapse of leaves sprouting in space!
The #CROPS (Compact Research Module for Orbital Plant Studies) experiment from VSSC on PSLV-C60 showcases the intriguing development of cowpea in a microgravity environment.#BiologyInSpace pic.twitter.com/TYNw9ccdMJ
— ISRO InSight (@ISROSight) January 7, 2025
ఇవి కూడా చదవండి
Earbuds” ఐటెల్ బడ్స్ ఏస్ 2 TWS ఇయర్‌బడ్స్.. జస్ట్ 1199లకే..
Different mobile” రౌండ్ స్క్రీన్ సర్కిల్ మొబైల్.. కేవలం రూ. 999లకే..
Rythu Bharosa” రాళ్లు రప్పల భూములకు బంద్.. భూమిలేనోళ్లకు రూ. 12 వేల సాయం..
TOSHIBA Smart LED TV” తోషిబా 43 ఇంచుల టీవీ ₹ 24,999లు..
China Virus News” చైనాలో ఆగమాగం..ఆస్పత్రులకు క్యూ కట్టిన జనం.. సీజనల్ వ్యాధే అంటున్న చైనా
Sankranthi holidays”11 నుంచి 17 వరకు సెలవులు..
Tamilnadu Pattukottais” రెండు బస్సుల మధ్య చిక్కుకుని ప్రాణాలతో బయటపడి.. వీడియో
Ear Buds”15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 240 నిమిషాలు బ్యాటరీ లైఫ్ బోట్ ఇయర్ బడ్స్ రూ. 1799 లకే…
Samsung Galaxy Watch6″ సాంసంగ్ గెలాక్సీ వాచ్ 6.. ₹39,999.. ఇంత ధరకు ఫీచర్లేంటో తెలుసుకుందామా..?
LG Smart LED TV” 43 ఇంచుల ఎల్ జీ స్మార్ట్ టీవీ కేవంల 30 వేలల్లో.. ప్రత్యేకతలు ఇవే..
Ear Buds”15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 240 నిమిషాలు బ్యాటరీ లైఫ్ బోట్ ఇయర్ బడ్స్ రూ. 1799 లకే…
Modern Wall Clock” మెగా హోం సేల్.. మోడ్రన్ వాల్ క్లాక్ 199 నుంచే ప్రారంభం
Lava Agni 3 5G Smart Phone” లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్..11 శాతం తగ్గింపుతో ₹24,998
