తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడన్నదానిపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో ఆయన విూడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విూడియతో మాట్లాడారు. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 15లక్షల మంది ఓటర్లుగా చేరారన్నారు. యువత, మహిళా ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టామన్నారు. 6.99 లక్షల యువ ఓటర్లను నమోదు చేయించినట్లు చెప్పారు. వచ్చే నెల 3, 4, 5 తారీఖుల్లో సీఈసీ (సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ) తెలంగాణాలో పర్యటిస్తారని తెలిపారు. తుది ఓటర్ల లిస్ట్ పూర్తయ్యాక జిల్లాలోని సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లనున్నట్టు చెప్పారు. థర్డ్ జెండర్ లను, 80 ఏళ్లు పైబడిన వృద్ధులను, పీడబ్ల్యూడీలను గుర్తిస్తున్నామని వివరించారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. దీనిపై జిల్లాల్లో అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
చదవండి ఇవి కూడా
లెక్కలు తేలుస్తాం పరిటాల సునితా
ఇక ‘సున్నా’ మార్కులొచ్చినా పీజీ సీటు
గ్రూప్ వన్ రద్దుకు కారణాలివే..