లెక్కలు తేలుస్తాం ప‌రిటాల సునితా

టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయ‌కుల లెక్కలు తేల్చుతామని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. నారా భువనేశ్వరి.. బ్రహ్మణిని మాజీ మంత్రి పరిటాల సునీత శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. ‘వైసీపీ నేతలు చేసిన అవినీతి అంతా బయటకు తీస్తాం. అప్పుడు జైళ్లు కూడా సరిపోవ‌న్నారు. చంద్రబాబు ఏ నేరం చేయలేదు. చంద్రబాబు అరెస్టు అక్రమం. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారు. రాజకీయ కక్ష్యతోనే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జగన్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలపై అంతకంతకు బదులు తీర్చుకుంటాం. తెలుగుదేశం పార్టీ నేతలు క్యాడర్‌ ధైర్యంగా ఈ సంక్షోభంపై పోరాడాలని సునీత పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

అయ్యో నాగ్‌పూర్

భార‌త్ వేదిక‌గా ప్ర‌పంచ స‌మ‌రం..

గ్ర‌హంత‌ర వాసులు భూమిదికొచ్చారా..? ఆ అస్థిపంజారాలు ఏం చెబుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *