సమాజంలో మాయగాళ్లకు, మోసగాళ్లకు కొదువలేకుండాపోతోంది. రోజుకో కొత్త మోసంతో అమాయకులను నట్టేట ముంచుతున్నరు. పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నా మాయగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. అటువంటి ఘటనే నల్గొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మా వద్ద ప్రత్యేకమైన రసాయం ఉంది. ఇది ముంబై నుంచి తెచ్చినాం. అంటూ నమ్మబలికి కోట్లాది రూపాయలు దండుకున్న ముఠా పట్టుకుని కటాకటాల్లోకి నెట్టారు నల్గొండ పోలీసులు. నల్గొండ జిల్లాలోని త్రిపురారం మండలం శీత్యాతండాకు చెందిన బాలు, ఉషా నాయక్‌లు హైదరాబాద్‌కు చెందిన తాలిబ్ షేక్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. నాగార్జున సాగర్, మిర్యాలగూడల్లో విలువైన వజ్రాలు ఉన్నాయంటూ పలువురిని మోసగించారు. ఈ క్రమంలో నవ్య, శ్రీనివాస్ దంపతులు త్రిపురారం నివాసులు. వీరు మిర్యాలగూడలో బంగారం దుకాణం నిర్వహించేవారు. అక్కడ బాలు, ఉషా నాయక్ లతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తమ వద్ద విలువైన వజ్రాలు ఉన్నాయని వీరి వద్దకు వచ్చారు. వాటిని ప్రత్యేకమైన రసాయనాలతో శుభ్రం చేస్తే బంగారంగా మారుతుందని చెప్పారు. ఆ కెమిల్‌ను ముంబై నుంచి తీసుకొస్తామని నమ్మబలికారు. విలువైన వజ్రాలు మిర్యాలగూడ టౌన్‌లోని ఇందిరమ్మ కాలనీలో ఓ గదిలో ఉన్నాయని నమ్మించి నవ్య, శ్రీనివాస్‌ల వద్ద నుంచి రూ.37.50 లక్షలు వసూలు చేశారు. అనంతరం తాలీబ్ షేక్ బొంబాయి నుంచి తెచ్చిన కెమికల్‌లో ఐదు వజ్రాలను శుభ్రం చేస్తున్నట్టు నటించారు. కొద్దిసేపటి తరువాత ముంబై నుంచి వచ్చిన డైమండ్ బాక్స్ మారిందంటూ హడావుడి చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నమని నల్గొండ పోలీసులు తెలిపారు.
Check Also
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Viral Video” తోటి వ్యక్తి తొడ కోసుకుంటే మనం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత.. అచ్చం అలాగే …