డీసీ తెలుగు నిజామాబాద్
ప్రజలకు ఆహార ధాన్యాలు అందించే లక్ష్యంతో అధిక ఉత్పత్తుల కోసం కొత్త వరి వంగడాలు, విత్తనాలను సృష్టించడంలో ఎం. ఎస్ స్వామినాథన్ అగ్రగన్యుడని IKMS జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించార. ఈ సందర్బంగా భూమయ్య మాట్లాడారు. ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తి పై కృషిచేసిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కు తన సంతాపాన్ని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశంలో తీవ్ర కరువు కాటకాలను ఎదుర్కొనేందుకు ఆహార పంటల ఉత్పత్తికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. భారత రైతు నిలబడేందుకు గాను పంటలకు కనీసం మద్దతు ధరలు అందించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పెట్టుబడిలో 50% అదనంగా కలిపి ధరలు నిర్ణయించాలని ఆయన చేసిన సూచనలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ మధ్యన మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలను వ్యతిరేకంగా జరిపిన రైతాంగ ఉద్యమాలను స్వామినాథన్ ప్రేరణగా నిలిచాయని చెప్పారు. ఆయన అందించిన సిఫార్సులను అమలుకు రాబోయే రోజుల్లో బలమైన రైతు ఉద్యమాలను నిర్మించాలని సూచించారు. అవే ఎం ఎస్ స్వామినాథన్ కు నిజమైన నివాళులవుతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా కార్యదర్శి దేషెట్టి సాయారెడ్డి, ఉపాధ్యక్షులు T. కృష్ణ గౌడ్, k. గోపాల నగేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Check Also
Game Changer Movie” గేమ్ చేంజర్ .. అర్థం చేసుకుంటే సమాజ చేంజర్..ఇది రివ్యూకాదు.. బాగుందని చెప్పే మాట
Game Changer Movie” ఎన్నో సినిమాలు చూస్తాం.. చూసి (enjoy) ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్నిసినిమాలు మాత్రం మనసుకు హత్తకుంటాయి. …