కాంతారాకు మూవీకి ప్రీక్వెల్‌ సన్నాహాలు మొదలు పెట్టామని ప్రకటన

‘కాంతార చిన్న సినిమాగా మొదలై ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో హోంబలే బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాకు కథ ఓ ఎత్తు అయితే.. ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది వరాహ రూపం పాట. ఈ పాట విని గూస్‌ బంప్స్‌ రాని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రిజనల్‌ సినిమాగా మొదలైన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో అలరించింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపు కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ‘కాంతారా 2’.. సీక్వెల్‌ కాదు ప్రీక్వెల్‌. ‘కాంతార’ చిత్రాన్ని ఇప్పటికే విూరు చూసేశారు. కాంతార చాప్టర్‌- 1 (ద లెజెండ్‌) త్వరలో రాబోతుంది’ అంటూ షాక్‌ ఇచ్చారు దర్శకుడు రిషబ్‌ శెట్టి. ఈ ప్రీక్వెల్‌ గురించి మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. రెండేళ్ల ఫ్యాన్స వెయిటింగ్‌కు ఎండ్‌ కార్డ్‌ వేశారు. ‘ప్రతి క్షణంలో దైవిక స్పర్శను అనుభవిస్తూ చరిత్రలో మర్మమైన సత్యాన్ని కనుగొనండి. మునుపెన్నడూ చూడని అద్భుతాన్ని చూసేందుకు సిద్ధంకండి. ఇది కాంతి మాత్రమే కాదు. ఇది దర్శనం’ అంటూ హోంబలే నిర్మాణ సంస్థ, రిషబ్‌శెట్టి ట్వీట్‌ చేశారు. ఈ నెల 27న మధ్యాహ్నాం 12:25 నిమిషాలకు ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ కానుందని చెప్పారు. ‘కాంతార’లో మొదటి 20 నిమిషాలకి ముందు జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే కాంతార సినిమాకి ప్రధాన బలం ‘భూత కోల’, ఈ భూతకోలాలను ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు లాంటి విషయాలను కాంతారా చిత్రంలో చూపించేశారు కాబట్టి ప్రీక్వెల్‌లో రిషబ్‌ శెట్టి కొత్తగా ఏం చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

దానికోస‌మే తండ్లాతున్నాం.. జగిత్యాల‌లో కేసీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్

సిమెంట్ లారీ బోల్తా ఆరుగురు మృతి

రైళ్లోనే చెప్పుతో చిత‌క‌బాదిన యువ‌తి వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *