తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే చర్చ. కాంగ్రెస్‌లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే. రేవంత్‌రెడ్డి తోపాటు, భట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి సీనియర్ల పేర్లు వినపడ్డాయి. రెండు రోజుల ఉత్కంఠ కు మంగళవారం సాయంత్రం తెరపడింది. తెలంగాణా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా రేవంత్‌రెడ్డిని ప్రకటిస్తూ కాసేపటి క్రితం ప్రకటించారు. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకంటే ముందు రేవంత్ రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశించారు. స్వచ్చమైన సమర్థవంతమైన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందిస్తుందని వేణుగోపాల్ ఆశా భావం వ్యక్తం చేశారు.
Congress President Shri @kharge has decided to go with Revanth Reddy as the new CLP of the Telangana Legislative Party.
The Congress will deliver a clean and able government that will provide maximum governance.
: Shri @kcvenugopalmp, General Secretary (Organisation) pic.twitter.com/njFUduUFsb
— Congress (@INCIndia) December 5, 2023
తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి..
తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రాసుకొచ్చారు.
తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి.
అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.
— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023
పాగాల సంపత్‌కు కెటిఆర్ నివాళి : అండగా ఉంటామని హామీ
నెక్స్ట్ ఐటీ మినిస్టర్ ఎవరు.. ? కేటీఆర్ పై ట్విట్టర్‌లో చర్చ
టీమిండియా నెక్ట్స్ టార్గెట్ సౌతాఫ్రికా