ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. ఆయా రాష్ట్రాల్లో ఎంపీలుగా ఉన్న కొంత మంది అసెంబ్లీ బరిలో నిలిచారు. ఆయా రాష్ట్రాలైనా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. వీరిలో 12 మంది ఎంపీలుగా గెలిచారు. ఇందులో 10 మంది ఎంపీలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశం అనంతరం వీరు తమ రాజీనామాలు సమర్పించారు. ఎంపీకి రాజీనామా చేసిన వారిలో మధ్యప్రదేశ్ నుంచి గెలిచిన రాకేష్ సింగ్, ఉదరు ప్రతాప్, రీతీ పాథక్, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఛత్తీస్‌గఢ్ నుంచి గోమతి సాయి, అరుణ్ సవో, రాజస్థాన్ నుంచి కిరోడి లాల్ విూనా రాజ్యవర్ధన్ రాథోడ్, ఉన్నారు. తోమర్, పటేల్ కేంద్ర మంత్రివర్గానికి కూడా రాజీనామా చేశారు. కిరోడి లాల్ విూనా రాజ్యసభకు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి రేణుకా సింగ్, మహంత్ బాలక్‌నాథ్ కూడా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రుల ఎంపిక పక్రియలో భాగంగా ఈ రాజీనామాల పర్యం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొద్ది మంది ఎంపీలు అసెంబ్లీ బరిలో నిలిచారు. అందులో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేయనున్న నేపథ్యంలో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పీకర్ ఓంబిర్లా ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
ఇవి కూడా చదవండి
సీటు కోసం వీర ఫైటింగ్ వీడియో చూడండి మరి