- ప్రమాదం తర్వాత పారిపోతే పదేండ్ల జైలు
- ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఏడేండ్ల శిక్ష, జరిమానా
- కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన
రొడ్డెక్కితే చాలు ఎప్పుడేం అవుతుందో తెలియదు.. వెనుక నుంచి ఆకతాయి జుయ్ మనుకుంటూ ఆగమాగం ఉరికి వస్తడు.. మనం సక్కగ పోయినా వాడే టక్కరిచ్చి పోతడు. కనీసం ప్రమాదం చేసినోడు ఆగి ఆస్పత్రికైనా తీసుకపోడు. తాకిత్తడు చేతికి దొరక చెంగో బిల్ల అన్నట్టు సందుకెళ్లి సల్లగా జారుకుంటడు.. ఇగ ఇప్పటి నుంచి గిట్ల ఉండది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నూతనచట్టం ఆకతాయిల గుండెల్లో గుబులు పుట్టంచనుంది. యాక్సిడెంట్ చేసి పారిపోయినా, ప్రమాదం గురించి పోలీసులకు చెప్పకపోయిన గరిష్టంగా పదేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు ప్రతిపాదించింది. నేరాలకు సంబంధించిన చట్టాలను పూర్తిగా మారుస్తున్న క్రమంలో తీసుకొస్తున్న భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఈమేరకు దుపరిచింది. హిట్ అండ్ అండ్ రన్ కేసులకు గరిష్టంగా పదేండ్ల జైలు శిక్ష విధించేలా ప్రతిపాదించింది. ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఏడేళ్ల వరకు శిక్ష విధించడంతో పాటు జరిమానా విధించనుంది.
2021లో 1.54 లక్షల మంది మృతి
రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య ఏటికేడు పెరుతూనే ఉంది. 2021లో 1.54 లక్షల మంది రణించినట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు గాయపడతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. 2021లో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నట్టు తెలిపింది.