కుక్కల దాడిలో గాయపడి చిన్నారి మృతి

జగిత్యాల ఆగ‌స్టు 12 :
కుక్క‌ల దాడిలో గాయ‌ప‌డి చిన్నారి మృతి చెందిన ఘ‌ట‌న జ‌గిత్యాల జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల.. 15 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంగేపు సాహిత్య (12) కుక్క దాడి చేసి గాయపరిచింది . ఆమెతోపాటు దాదాపు పదిమందిపై దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి శ‌నివారం మృతి చెందింది. ఈ మృతి ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *